
ఇదిగో సీక్వెల్ అంటే అదిగో కార్తకేయ 2 అనే సారు. దీనికి కారణం లేకపోలేదు. స్క్రిప్ట్ తయారవుతోందని హీరో నిఖిల్ ట్వీట్ చేయడమే కారణం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కార్తికేయ 2 2018లో వుండకపోవచ్చు. 2019లో వుండే అవకాశం వుందేమో?
ఎందుకంటే కార్తికేయ సినిమా దర్శకుడు చందు మొండేటి నవంబర్ 8న నాగ్ చైతన్య-నిధి అగర్వాల్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సవ్యసాచి సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సినిమా వర్క్ మార్చి వరకు వుంది. ఆ సినిమా తరువాత పెద్ద హీరోలు ఎవరితోనైనా సినిమా చేసే ఆలోచనలో వున్నారు చందు మొండేటి.
మరోపక్క నిఖిల్ ప్రస్తుతం కిర్రాక్ పార్టీ తెలుగు అనువాదం చేస్తున్నారు. దాని తరువాత గణితన్ తెలుగు అనువాదం చేయాల్సి వుంది. అంటే అది అయ్యే సరికి 2018 సమ్మర్ దాటిపోతుంది. కానీ అప్పటికి చందు కూడా ఖాళీ కావాలి. అందువల్ల ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ కావడానికి కనీసం ఏడాది టైమ్ పడుతుంది.
అందువల్ల కార్తికేయ 2 అన్నది ఇప్పట్లో కాదు. పైగా ఇక్కడ ఇంకో ట్విస్ట్ వుంది. కార్తికేయ 2 కాస్త భారీ బడ్జెట్ సినిమా. కార్తికేయ మాదిరిగా మీడియం బడ్జెట్ కాదు. అంత బడ్జెట్ సినిమా మార్కెట్ కావాలంటే, నిఖిల్ కు రెండు హిట్ లు పడాలి. చందు రెండు హిట్ లు కొట్టాలి. అప్పుడు పాతిక కోట్ల మార్కెట్ వస్తుంది. కార్తికేయ 2కు అది చాలా అవసరం.
Recent Random Post: