గ్లామర్ కి కొత్త అర్ధం చెప్పిన హీరోయిన్..!

ప్రేమం సినిమాతో సౌత్ ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. హీరోయిన్స్ మేకప్ లెస్ గా కనిపిస్తే అసలు నచ్చరు కానీ ఈమె మాత్రం మేకప్ లేకుండా నటిస్తేనే సూపర్ అనేస్తారు. తన కెరీర్ ఎలా మొదలైంది ఎలా సక్సెస్ అయ్యింది అన్న విషయాలపై తన బర్త్ డే రోజు స్పెషల్ చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు సాయి పల్లవి. నాన్న కష్టంస్ అధికారి.. అమ్మ డాన్సర్. తను చెల్లి పూజా కవలలం. అమ్మ చేస్తున్న డ్యాన్స్ చూస్తూ పెరగడం వల్ల మా ఇద్దరికీ డాన్స్ అంటే ఆసక్తి పెరిగిందని అన్నారు. స్కూల్ డేస్ నుంచే డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనడం అలవాటుగా మారింది. అలా ఓ సినిమా ఏజెన్సీ వాళ్లు చిన్న పాత్ర కోసం తనని సంప్రదించారు. తాను 8వ తరగతి చదువుతున్నా తనకు లెక్కలు అంటే భయం క్లాస్ నుంచి తప్పించుకోవచ్చనే ఆ సినిమా చేశా.

అలా తెరపైన మొదటిసారి ధామ్ ధూమ్ లో కంగనా రనౌత్ పక్కన చేశాను. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి డాన్స్ షోలు చేశా. తమిళ్ లో స్టార్ విజయ్ ఈటీవీ ఢీ షోల్లో అవకాశం వచ్చింది. ఆ టైం లో తన ఏరియాలో తానొక VIP అయిపోయాననని చెప్పారు సాయి పల్లవి. నలుగురు మనల్ని అభిమానిస్తుంటే ఆనందంగా ఉంటుంది. వారి అభిమానం సంపాదించడం కోసం ఇంకా కష్టపడాలని అనిపించేదని అన్నారు. ఆ టైం లో హీరోయిన్ గా చాన్స్ లు రాగా అమ్మా నాన్న నో అనేశారు. కొన్నాళ్లు కెరీర్ బాగుంటుంది ఆ తర్వాత ఏం చేస్తావ్ అన్న ప్రశ్న ఎదురైంది. అప్పుడు వాళ్లకు సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు. అందుకే అక్కడే ఉంటే సినిమాలు చేస్తానని అంటానని జార్జియాలో మెడిసిన్ చేయించారు.

ఆ నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. నటి అవ్వాలనే ఆసక్తి అలానే ఉంది. ఆ టైం లో అల్ఫోన్స్ కొత్త సినిమాకు నటీనటులు కావాలని మెయిల్ వచ్చింది. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో హాలీడేస్ లో మాత్రమే నటిస్తానని చెప్పగా నాన్న ఓకే అన్నారు. అదే ప్రేమం సినిమా.. ఆ తర్వాత కలి ఛాన్స్ వచ్చింది. మెడిసిన్ పూర్తి చేశాక తెలుగులో ఫిదా అవకాశం వచ్చింది. ఇక అక్కడ నుంచి అందరికీ తెలిసిందే అని చెప్పారు సాయి పల్లవి.

తన దృష్టిలో గ్లామర్ అంటే ఎంపిక చేసుకునే పాత్ర ప్రేక్షకులకు చేరవేయడమే అంటున్నారు సాయి పల్లవి. ప్రేమం టైం లో ప్రేక్షకులు తనని ఆదరిస్తారా లేదా అని భయం ఉంది. ముఖం పై మొటిమలతో తెరపై ఎలా కనిపిస్తానో అనుకున్నాను.. తనకు తానే నచ్చడం లేదు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారని అనుకున్నాను. కానీ అన్నిటినీ పక్కన పెట్టి తాను ఆ సినిమా చేశాను. ఆ సినిమా చూసిన అందరు తనని ఒక హీరోయిన్ గా కాకుండా తమ ఇంట్లో అమ్మాయిలా ఉందని అన్నారు. అది తనలో ఆత్మ విశ్వాసం పెంచింది. తనలాంటి అమ్మాయిలకు కూడా నేను స్పూర్తిగా ఉంటానని అనిపించింది. నా ప్రతి సినిమా దర్శకుడు ఒకటి రెండు రోజులు మేకప్ వేసుకోమని అంటారు. తర్వాత మేకప్ వేస్తే నువ్వు నీలా కనిపించట్లేదని తీసేయమని అంటారు. అందుకే మేకప్ కి దూరంగా ఉంటూ పాత్రకి దగ్గరగా ఉంటానని అన్నారు. ఫిదా లో తన పాటని అల్లు అర్జున్ ఎన్నోసార్లు చూశానని చెప్పడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అల్లు అర్జున్ డాన్స్ కు తాను పెద్ద అభిమానిని అని అన్నారు సాయి పల్లవి.

క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఎలా డబ్బుని సంపాదించాలా అని ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే వాణిజ్య ప్రకటలను చేస్తారు కానీ సాయి పల్లవి మాత్రం వాటికి దూరం అనేస్తుంది. ప్రకటనలో నటించడం తనకు ఇష్టం లేదని అంటుంది. స్వచ్చంద సంస్థల కార్యక్రమాలైతే పారితోషికం లేకుండా చేశానని అన్నారు. సాయి పల్లవి డ్యాన్సర్ నటి మాత్రమే కాదు హర్డిల్స్ ప్లేయర్ కూడా అట. సాయి పల్లవికి ఇష్టమైన హీరో సూర్య. ఆమె రన్నింగ్ అంటే కూడా చాలా ఇష్టమట. హారర్ సినిమాలు చూడాలంటే సాయి పల్లవికి భయమట. సీతాకోక చిలుకల్ని పట్టుకుని వదిలేయడం.. ఫ్రీ టైం లో డ్రైవింగ్ చేయడం లాంటివి చేస్తుందట సాయి పల్లవి.


Recent Random Post: