
మెగాస్టార్ చిరంజీవి అద్భుతం చేశాడు. తన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’తో అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా రూ.100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి సంచలనం సృష్టించింది. వంద కోట్ల షేర్ అన్నది తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు.
దక్షిణాదిన తమిళ సినిమాలు కూడా ఈ ఘనత సాధించాయి. ఐతే ఈ విషయంలో చిరు యునీక్ రికార్డు సాధించాడు. ఒక్క భాషలో మాత్రమే విడుదలై 100 కోట్ల షేర్ సాధించిన తొలి సౌత్ సినిమా ఇదే కావడం విశేషం. ‘బాహుబలి’, ‘రోబో’ లాంటి సినిమాలు మల్టిబుల్ లాంగ్వేజెస్‌లో రిలీజయ్యాయి. ‘ఖైదీ నెంబర్ 150’ మాత్రం తెలుగులో మాత్రమే రిలీజైంది.
పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేసి ఇలా రికార్డుల మోత మోగించడం చిరుకే చెల్లింది. థండర్ ఓపెనింగ్స్‌తో తొలి వారాంతంలోనే రూ.70 కోట్ల దాకా షేర్ రాబట్టిన ‘ఖైదీ నెంబర్ 150’.. ఆ తర్వాత నెమ్మదించింది కానీ.. వారాంతాల్లో పుంజుకుని మంచి వసూళ్లే రాబట్టింది. ఓ దశలో 95 కోట్ల మార్కు దగ్గర ఆగిపోతుందేమో అనుకున్నారు కానీ.. కొంచెం కొంచెం కూడదీసుకుని వంద కోట్ల షేర్ మార్కును అందుకుంది.
ఒక్క నైజాం ఏరియా మినహాయిస్తే ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ లాభాలు తెచ్చిపెట్టింది. వైజాగ్ ఏరియాలో రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ‘బాహుబలి’కి కూడా ఆ ఘనత సాధ్యం కాలేదు.
Recent Random Post: