తిట్టేవాళ్ళు తిట్టనీ: ప్రియాంకా చోప్రా

‘కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు..’ అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా. బాలీవుడ్‌ బ్యూటీ మాత్రమే కాదు, హాలీవుడ్‌లో సెటిలైపోయింది గనుక హాలీవుడ్‌ బ్యూటీ అనెయ్యాలేమో.! ‘ఎలా పిలిచినా నాకు ఓకే.. బాలీవుడ్‌ నుంచే నేను ఈ స్థాయికి ఎదిగాను.. హాలీవుడ్‌ నటి అన్న ప్రస్తావన నాకూ ఆనందమే.. కానీ, బాలీవుడ్‌ నటి అన్న పిలుపే ఇష్టం..’ అని చెప్పుకొచ్చిన ప్రియాంకా చోప్రా, కెరీర్‌లో ఈ స్థాయికి ఎదగడానికి ప్రశంసలతోపాటు విమర్శలూ కారణమేనని చెప్పుకొచ్చింది.

హాలీవుడ్‌కి వెళ్ళాక బాలీవుడ్‌ని మర్చిపోలేదనీ, ఎక్కువమందికి రీచ్‌ అయ్యే అవకాశం హాలీవుడ్‌ ద్వారా దక్కడంతో అక్కడ అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నాననీ, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూనే వుంటానని అంటోంది ప్రియాంకా చోప్రా. ‘నా డ్రెస్సింగ్‌ గురించి అనవసరమైన వివాదాలొస్తున్నాయి.. అది నా వ్యక్తిగతం. ఓ మహిళ వస్త్ర ధారణపై నీఛంగా కామెంట్‌ చేసే స్థాయి నుంచి కొందరు ఎదగాలి.. హుందాతనం అలవాటు చేసుకోవాలి..’ అని ప్రియాంక క్లాస్‌ పీకింది.

స్విమ్మింగ్‌ పూల్‌లోనూ, బీచ్‌లోనూ స్విమ్‌ చేయాల్సిన సీన్‌లో శారీ కట్టుకోలేం కదా.? అంటూ ప్రశ్నించిన ప్రియాంక, బాలీవుడ్‌ సినిమాల్లోనూ బికినీల్లో కన్పించాననీ, హాలీవుడ్‌ సినిమాల్లో అది ఇంకా కామన్‌ థింగ్‌ అనీ, ఆ విషయానికే కొందరు రాద్ధాంతం చేయడం నవ్వు తెప్పించిందని చెప్పింది.

సౌత్‌లో ఏ హీరోతో నటించాలని వుంది.? అన్న ప్రశ్నకి, ‘విజయ్‌ నా ఫేవరెట్‌ హీరో..’ అని సమాధానమిచ్చింది ప్రియాంకా చోప్రా. ‘తిట్టేవాళ్ళు తిట్టనీ.. అది నా ఎదుగుదలకు ఉపయోగపడ్తుంది.. కొన్నిసార్లు, వారి విమర్శల్లోంచి కొన్ని పాజిటివ్‌ పాయింట్స్‌ని పిక్‌ చేసుకుంటా.. అదే నా స్ట్రాంగ్‌నెస్‌ సీక్రెట్‌..’ అని ఓ ప్రశ్నకి ప్రియాంక సమాధానమిచ్చింది.


Recent Random Post: