బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇటీవల పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలం తర్వాత ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న పఠాన్ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ చేస్తున్న సినిమా జవాన్.
తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్రలో నయనతార పోషిస్తున్న విషయం తెల్సిందే. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ను సెప్టెంబర్ 7వ తారీకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా హీరో షారుఖ్ ఖాన్ అభిమానులతో ఆన్ లైన్ ద్వారా చిట్ చాట్ చేశాడు. జవాన్ సినిమా పై తనకున్న నమ్మకం గురించి షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నాడు.
నయనతార గురించి షారుఖ్ ని అడిగిన సమయంలో ఆమె చాలా అందగత్తె మరియు స్వీట్ పర్సన్ అన్నట్లుగా పేర్కొన్నాడు. ఆమెతో వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కూడా అన్నాడు. ఇక విజయ్ సేతుపతి గురించి షారుఖ్ మరింత ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశాడు. అతడు చాలా ప్రతిభావంతుడు.. ఒదిగి ఉండే వ్యక్తిత్వం. అతడి నుండి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను అంటూ విజయ్ సేతుపతి గురించి షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు చేశాడు.
Recent Random Post: