పవన్ కళ్యాణ్ ఒరిజినల్ లుక్ తో ఫాన్స్ బేజారు!

కొన్ని రోజులుగా పవన్ తన కొత్త సినిమాలోని గెటప్ లోనే బయట కూడా కనిపిస్తున్నాడు. సినిమాలు మొదలు పెట్టినప్పటితో పోలిస్తే పవన్ ఫిట్ అయిపోయాడంటూ, మళ్ళీ మునుపటి గ్లామర్ వచ్చేసింది అంటూ మీడియాలోనూ ఊదరగొట్టారు.

అయితే కరోనా కోసం మోడీ చేయమన్న జనతా కర్ఫ్యూని ప్రచారం చేయడం కోసం పవన్ మళ్ళీ తన ఒరిజినల్ లుక్ తో కెమెరా ముందుకి వచ్చాడు. ఈ వీడియోలో పవన్ ఒరిజినల్ లుక్ చూసి ఫాన్స్ ఫీలవుతున్నారు. యూత్ ఐకాన్ గా పిలుచుకునే పవన్ ఇక యంగ్ గా కనిపించడం లేదని, వయసు భారం ఒకేసారి పడిపోయిందని మాట్లాడుకుంటున్నారు.

రాజకీయ ఒత్తిళ్ల వల్ల పవన్ ఇలా అయ్యాడని, అసలు అటు వెళ్లకుండా ఉంటె ఇంకా గ్లామర్ అలాగే ఉండేదని అనుకుంటున్నారు. మళ్ళీ సినిమా నీళ్లు పడుతున్నాయి కనుక పవన్ త్వరలో ఆ రూపం సంతరించుకుంటాడేమో. అంత వరకు ఫాన్స్ ఎదురు చూడక తప్పదు.


Recent Random Post: