
సినీ విశ్లేషకుడు, దర్శకుడు, తెలుగు బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్ కత్తి మహేష్‌కి, పవన్‌కళ్యాణ్ అంటే అదో ఇది. పవన్‌కళ్యాణ్ అభిమానులకీ కత్తి మహేష్ అంటే అదో ఇది. పవన్‌కళ్యాణ్ పార్టీ జనసేనపైనా, పవన్‌కళ్యాణ్‌పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కత్తి మహేష్ దిట్ట. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, ‘అది నా ఇష్టం. నా భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మీకెక్కడిది.?’ అని ప్రశ్నిస్తుంటారాయన.
‘చంపేస్తాం.. నరికేస్తాం..’ అంటూ పరమ రొటీన్‌గా అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డం, దానిపై కత్తి మహేష్ గుస్సా అవడం.. వెరసి, ఇటీవలి కాలంలో ఆయన కూడా ‘సెలబ్రిటీ’గా స్టేటస్ బాగానే పెంచుకున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, సుమారు 40 లక్షల రూపాయల విలువైన పబ్లిసిటీ ఆయనకు పవన్ అభిమానుల ద్వారా ఉచితంగా లభించేసిందట.
ఇక, తాజాగా ఓ టీవీ షోలో కామెడీ స్కిట్ సందర్భంగా టీమ్ లీడర్, టీమ్ మెంబర్ మీద వేసిన ఓ పంచ్, కత్తి మహేష్‌కి ఒళ్ళు మండేలా చేసింది. సదరు టీమ్ లీడర్ పవన్ అభిమాని గనుక, తన మీద ఆ స్కిట్ ప్లే చేశాడంట కత్తి మహేష్ మళ్ళీ మీడియాకెక్కాడు. పవన్ తన అభిమానుల్ని కంట్రోల్లో పెట్టుకోవడంలేదనీ, ఇప్పటికైనా పవన్ – అభిమానుల తీరుపై స్పందించాలనీ డిమాండ్ చేసేశాడు. ఒకవేళ పవన్ స్పందిస్తే, తాను జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా వున్నానని కత్తిమహేష్ చెప్పడం గమనార్హం.
భలే కామెడీగా వుంది కదూ.! అయినా, పవన్‌కళ్యాణ్ ఇలాంటి విషయాలపై స్పందిస్తాడా.? జనసేన పార్టీపై విరుచుకుపడే కత్తి మహేష్, పవన్ పార్టీలో చేరడానికి నిజంగానే సుముఖంగా వున్నాడా.? ఏమోగానీ, ‘పవన్ అభిమానులే నన్ను సెలబ్రిటీని చేసేస్తున్నారు..’ అంటూ కత్తి మహేష్ వ్యాఖ్యానించడం విశేషమే మరి.
అన్నట్టు, సోకాల్డ్ పవన్ అభిమానుల్లా, నేను కూడా పవన్ కళ్యాణ్ అంటే దేవుడిలా భావించి, భక్తుడినైపోయి, ఆయన దైవత్వం ఏంటో తెలుసుకుంటానని కత్తి మహేష్ వెటకారం చేయడం కొసమెరుపు ఇక్కడ.
Recent Random Post: