పుట్టినరోజున ప్రభాస్ కు ఊహించని కానుక

ఈరోజు తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ఈ సందర్భంగా సాహో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దీంతో పాటు మరో ఊహించని గిఫ్ట్ కూడా అందుకున్నాడు ప్రభాస్. ఇతడు నటించిన బాహుబలి-2 సినిమా ఈమధ్యే టీవీల్లో ప్రసారమైంది. ఒకే రోజు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను దశలవారీగా ప్రసారం చేశారు. వాటి రేటింగ్స్ ఈరోజు వచ్చాయి.

సరిగ్గా ప్రభాస్ పుట్టినరోజున, ‘బాహుబలి-2: ది కంక్లూజన్’ రేటింగ్స్ రావడం యాధృచ్ఛికమే అయినప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం తాజా రేటింగ్స్ తో పండగ చేసుకుంటున్నారు. అవును.. బాహుబలి-2 సినిమాకు ఏకంగా 22 (అర్బన్, రూరల్ కలిపి) టీఆర్పీ వచ్చింది. పుట్టినరోజు నాడు ప్రభాస్ కు నిజంగా ఇది ఊహించని బహుమతే. సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా.. బుల్లితెరపై కూడా ఈ సినిమా విజయం సాధించిందనడానికి ఈ టీఆర్పీ నిదర్శనం.

టీవీల్లో 22 రేటింగ్ అనేది చెప్పుకోదగ్గ నంబర్ అయినప్పటికీ.. బాహుబలి-2కు మాత్రం అంతకుమించి ఎక్స్ పెక్ట్ చేశారు. బార్క్ వ్యవస్థ వచ్చిన తర్వాత సూపర్ హిట్ సినిమాలకు టీవీల్లో 18-20 మధ్య రేటింగ్స్ రావడం కామన్ అయిపోయింది. శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమాకు కూడా 20 టీఆర్పీ వచ్చింది.

స్టార్ మా యాజమాన్యం ఈ సినిమాకు అటుఇటుగా 27-30 మధ్య టీఆర్పీ ఎక్స్ పెక్ట్ చేసింది. ఆ నంబర్ ను బాహుబలి-2 అందుకోలేకపోయింది. కానీ 22 టీఆర్పీ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ది బెస్ట్ నంబర్ అనే చెప్పాలి.


Recent Random Post: