
తెలుగులో ‘బెజవాడ’, ‘నాయక్’ సినిమాల్లో నటించిన అమలాపాల్ గుర్తుంది కదా.? తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించిన అమలాపాల్, తాజాగా ఓ కారుకి సంబంధించిన వివాదంలో ఇరుక్కుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, అమలాపాల్ కారు కొనుగోలు విషయంలో ట్యాక్స్ సరిగ్గా చెల్లించలేదన్న కారణంగా ఆమెపై చర్యలకు ఆదేశించారనే ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అమలాపాల్‌పై కేసు కూడా నమోదయినట్లు వార్తలొచ్చాయి.
ఈ ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో ముందుగా స్పందించిన అమలాపాల్, ఓ పడవ మీద వెళుతున్న ఫొటో షేర్ చేసి, ఓ సెటైరికల్ కామెంట్‌ని కూడా పోస్ట్ చేసింది. తాజాగా, తనపై వచ్చిన ఆరోపణలపై సుదీర్ఘ వివరణ ఇచ్చింది అమలాపాల్. ఈ వివరణలో, ఓ పత్రికపై ఆమె ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం. ‘తెలుగు సినిమాల్లో నటిస్తే వచ్చే రూపాయలే, తమిళ సినిమాల్లో నటించినందుకూ వస్తాయి. మలయాళ, కన్నడ సినిమాల్లో అయినా అంతే. దేశంలో ఎక్కడైనా నేను సంపాదించుకునే వీలు నాకుంది. ఎక్కడైనా ఆస్తుల్ని నేను కొనుగోలు చేయొచ్చు..’ అంటూ సుదీర్ఘ వివరణలో ప్రస్తావించింది అమలాపాల్.
పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం వున్న సదరు పత్రిక వాస్తవాలు తెలుసుకోకుండా, తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించిందంటూ అమలాపాల్ పేర్కొన్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేసింది. నిజమే మరి, అందాల తారలకి ‘ఐక్యూ’ చాలా తక్కువని ఈ మధ్యనే ఓ బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించాడు. ఓ హీరోయిన్ అయితే, సామాజిక అంశాలపై తనకు అవగాహనే లేదని చాలా సందర్భాల్లో చెప్పింది. నిజానికి, ఇంత జాగ్రత్తగా, ఇంత మెచ్యూరిటీతో వివరణ ఇవ్వడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో అమలాపాల్ ది గ్రేట్ అనాల్సిందేనేమో.!
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిన్న వివాదంతో అమలాపాల్ ఫైర్ బ్రాండ్ అయిపోయిందనొచ్చు. ప్రేమించి, పెళ్ళి చేసుకుని, ఆ పెళ్ళికి గుడ్ బై చెప్పాక, అమలాపాల్ మైండ్‌సెట్ చాలా మారింది.. మెచ్యూరిటీ లెవల్స్ పీక్స్‌కి వెళ్ళిపోయాయ్. సాధారణంగా మీడియాపై సెటైర్లు వేయడానికి సినీ సెలబ్రిటీలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయన్నది వారి ఆలోచన. కానీ, అమలాపాల్ ‘డోన్ట్ కేర్’ నైజం ప్రదర్శించడం విశేషమే మరి.
Recent Random Post:

















