మరో హీరోయిన్ కు ఝలక్ ఇచ్చిన నాగశౌర్య

మొన్నటికిమొన్న హీరోయిన్ సాయి పల్లవిపై ఓపెన్ గా విరుచుకుపడ్డాడు నాగశౌర్య. సాయి పల్లవి అంత పొగరుబోతు పిల్లను ఎక్కడా చూడలేదన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడీ హీరో మరో హీరోయిన్ కు షాక్ ఇచ్చాడు. ఆమె మరెవరో కాదు, ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మెహ్రీన్.

తన సొంత బ్యానర్ పై నర్తనశాల సినిమా స్టార్ట్ చేశాడు నాగశౌర్య. ఈ మూవీతో చక్రవర్తి అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. నిన్నట్నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో ముందుగా మెహ్రీన్ ను అనుకున్నారు. ఆ విషయాన్ని చూచాయగా ఓపెనింగ్ రోజున స్వయంగా నాగశౌర్య వెల్లడించాడు. అంతా ఓకే అయిపోయింది. ఇక అగ్రిమెంట్ పై సంతకం ఒక్కటే పెండింగ్. అంతలోనే ఊహించని మార్పు.

చెప్పాపెట్టకుండా మెహ్రీన్ ను తన సినిమా నుంచి తొలిగించాడట నాగశౌర్య. ఆ స్థానంలో హలో బ్యూటీ కల్యాణి ప్రియదర్శిని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం ఈ అమ్మాయి.. శర్వానంద్ సరసన సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తోంది. ఇలా ఊహించని విధంగా చేతివరకు వచ్చిన ఛాన్స్ మిస్ అవ్వడంతో షాక్ అయింది మెహ్రీన్.

నాగశౌర్య ఎందుకిలా ప్రవర్తించాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. మెహ్రీన్ కంటే కల్యాణి తక్కువ తీసుకుంటోందని ఆమెను తీసుకున్నారా, లేక రవితేజ లాంటి సీనియర్ సరసన చేసిన మెహ్రీన్ కంటే, తన సరసన కల్యాణి అయితే మరింత ఫ్రెష్ గా ఉంటుందని భావించాడో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఛలో సక్సెస్ తర్వాత నాగశౌర్య వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందంటున్నారు సినీజనాలు. కోన వెంకట్ తో కలిసి చేయాల్సిన ఓ ప్రాజెక్టును కూడా నాగశౌర్య పక్కనపెట్టిన విషయం తెలిసిందే.


Recent Random Post: