
రంగ..రంగ.. అంటూ సాగే రంగస్థలం టైటిల్ సాంగ్ రిలీజైంది. ఇది ఎలా ఉండబోతోందనే విషయాన్ని మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ నిన్ననే ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడా ఫుల్ సాంగ్ ను లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేశారు. పక్కా జానపద బాణీలో జోష్ ఫుల్ గా సాగింది రంగస్థలం టైటిల్ సాంగ్.
‘వినబడేట్టు కాదురా.. కనబడేట్టు కొట్టండహే’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ తో ఈ సాంగ్ స్టార్ట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ డప్పుకు తగ్గట్టే రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ బాగా సింక్ అయింది. పెద్దగా ప్రయోగాలు చేయకుండా, రెగ్యులర్ గా పల్లెల్లో వినిపించే డప్పు సౌండ్ ను యాజ్ ఇటీజ్ దించేశాడు దేవిశ్రీ.
ఇక చంద్రబోస్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. ఇంతకుముందు విడుదల చేసిన ఎంత సక్కగున్నావే అనే పాటకు ఎంత మంచి సాహిత్యం అందించాడో… ఈ టైటిల్ సాంగ్ కు కూడా మంచి సాహిత్యం ఇచ్చాడు. చిన్నచిన్న పదాలతో దేవుడి గురించి చంద్రబోస్ చేసిన వర్ణనలు చక్కగా కుదిరాయి.
ఇప్పటివరకు విడుదలైన 2 పాటలతో రంగస్థలంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా
Recent Random Post: