
రాజమౌళిని ఒకటికి రెండుసార్లు లండన్‌కి పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చంద్రబాబు ఆలోచనల్ని, రాజధాని అమరావతికి సంబంధించి డిజైన్లు తయారు చేస్తోన్న నార్మన్ ఫోస్టర్స్ సంస్థకు వివరించే ఉద్దేశ్యంతో రాజమౌళిని లండన్‌కి పంపించడం, అక్కడ రాజమౌళి ఆ సంస్థ ప్రతినిథులకు కొన్ని సూచనలు చేయడం తెల్సిన విషయాలే.
ముందు రాజమౌళి, సీఆర్డీఏ అధికారులతో కలిసి నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిథుల్ని కలిశారు. కొన్ని సూచనలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు లండన్‌కి వెళితే ఇంకోసారి రాజమౌళి అక్కడికి వెళ్ళారు. ఈలోగా రాజమౌళి సూచనల మేరకు మార్చిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ చంద్రబాబు ముందుంచింది. అప్పుడు మళ్ళీ చర్చలు జరిగాయి, మార్పులు చేర్పులు చంద్రబాబు మళ్ళీ సూచించారట. ‘అన్నీ చాలా బాగున్నాయి..’ అని అక్కడ చెప్పిన చంద్రబాబు, చిన్న చిన్న మార్పులు చేసేస్తే ఫైనల్ చేసేద్దామని ఆ సంస్థకు సూచించి వచ్చారు కూడా.
కానీ, ఇండియాలో అడుగు పెట్టాక చంద్రబాబు ఆలోచనలు మారిపోయినట్టున్నాయి. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా, రాజమౌళి అందించిన సేవల్ని కొనియాడేశారు. రాజమౌళి విలువైన సూచనల్ని చేశారనీ చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ, ఏం లాభం.? అక్కడ అసెంబ్లీ డిజైన్ ఖరారు కాలేదు. ఇంకో 40 రోజుల సమయం ఆ డిజైన్ల కోసం పడుతుందట. దానర్థమేంటి.! రాజమౌళి చేసిన సూచనలూ చంద్రబాబుకి నచ్చలేదనే కదా.!
గతంలో మాకీ సంస్థనీ ఇలాగే మకిలి పట్టించేశారు చంద్రబాబు. అది డిజైన్లు అందించిన సంస్థ. కానీ, ఇక్కడ రాజమౌళి పరిస్థితి వేరు. అంతన్నాడింతన్నాడే.. తరహాలో రాజమౌళిని ఎక్స్పోజ్ చేసేసి, రాజమౌళి పరువు తీసేసినట్లయ్యింది. చంద్రబాబుతో వ్యవహారమిలాగే వుంటుందని రాజమౌళికి ఈపాటికే అర్థమయి వుండాలి.!
Recent Random Post:

















