విక్రమ్ కుమార్ తో నాని

నాని లైనప్ బాగుంది. సినిమాల మీద సినిమాలు పడుతున్నాయి. ఇప్పుడు మాంచి కాంబినేషన్ దొరకింది. వైవిధ్యమైన సినిమాలు నిర్మించే విక్రమ్ కె కుమార్ తో సినిమాచేయబోతున్నాడు. దీనికి నిర్మాత ఎవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల.

ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే నిజానికి ఈ సినిమా మహేష్ బాబుది. అతని కోసమే సోదరి మంజుల విక్రమ్ కె కుమార్ డేట్లు తీసుకున్నారు. కానీ మహేష్ బాబు 2020 వరకు అందుబాటులో లేరు. అందుకే ఆ డేట్లతో నానిని అప్రోచ్ కావడం, ఆయన ఓకె అనేయడం అయిపోయింది.

నాని ఓ సినిమాను హను రాఘవపూడికి కమిట్ అయ్యాడు. అనిల్ సుంకర్ స్నేహితుడు సుధాకర్ నిర్మాత. అయితే ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు నాని. ఆ డేట్లను ఇప్పుడు ఇటు సర్దుబాటు చేస్తున్నాడు.

మంజుల ఇప్పటికే ఓ సినిమాను సందీప్ కిషన్ హీరోగా నిర్మిస్తున్నారు. దాదాపు రిలీజ్ కు దగ్గరయింది. ఆ పనులు పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభిస్తారు. నాని చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు వున్నాయ. దిల్ రాజు సినిమా వుంది. బాబీకి ఓ సినిమా కమిట్ అయ్యే దశలో వుంది.


Recent Random Post: