
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఇంకా కొత్త బలాల్ని సంతరించుకోవడానికి ఫోకస్ పెడుతోంది. కొత్తగా తమ పార్టీకి ఎడ్వాంటేజీ గా ఉండేట్లయితే ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకోవడానికి ప్రయత్నించడం వింత కాదు. అయితే అధికార పార్టీ వారు వచ్చే ఉద్దేశంతో ఉన్నా.. ఎన్నికల ముందు తప్ప రారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీనుంచి అయితే నాయకులు వచ్చే అవకాశం ఉంది.
అలాంటివారిని ఆహ్వానించే క్రమంలో.. ఇప్పుడు మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వంతు వచ్చినట్లుగా క నిపిస్తోంది. నాదెండ్ల మనోహర్.. త్వరలో వైసీపీ లో చేరుతారనే ప్రచారం ఒకటి జోరుగా జరుగుతోంది. అయితే అన్న ఎన్టీఆర్ కు సంబంధించి.. వెన్నుపోటు పొడిచాడని రాష్ట్ర ప్రజలు భావించే నాదెండ్ల భాస్కరరావు వారసుడిని తమ పార్టీలో చేర్చుకుని.. వైసీపీ కొత్తగా తమ మీద మరొక ముద్ర వేయించుకుంటుందా? అందుకు సిద్ధంగా ఉందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ మరియు ఎన్టీఆర్ అభిమానుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టమైన స్ట్రాటజీ ఉంది. ఆయన ఎన్నడూ ఎన్టీఆర్ ను తప్పుపట్టలేదు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన నాయకుడి కింద చంద్రబాబును నిందిస్తూ.. ఆ రకమైన ప్రయోజనం మాత్రమే కోరుకున్నారు. అయితే బాబు మీద అదే నిందలు వేస్తూ.. అంతకంటె ఎక్కువగా.. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచినట్లుగా జనం నమ్ముతున్న నాదెండ్ల భాస్కర రావు వారసుడిని జగన్ తన దరికి చేర్చుకుంటారా అనేది ఇప్పుడు పలువురిలో రేగుతున్న సందేహంగా ఉంది.
నందమూరి తారక రామారావు కు సంబంధించినంత వరకు నాదెండ్ల భాస్కరరావును తెలుగు ప్రజలు, ప్రత్యేకించి ఎన్టీఆర్ అభిమానులు ఎన్నటికీ క్షమించే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు నాదెండ్ల మనోహర్ రాకవల్ల మాత్రం వైసీపీకి అదనంగా ప్రయోజనం ఏమైనా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఠికానా లేకుండా పోయింది గనుక… టూ తనకు ఆ పార్టీ ద్వారా ఆ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు గనుక.. ఆయన ప్రత్యమ్నాయ పార్టీని వెతుక్కోవాల్సిందే. అదే సమయంలో ఆయన వల్ల తమ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమిటి జగన్ కూడా ఆలోచించుకోవాలి కదా.. అని పలువురు సూచిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ ను చేర్చుకుంటే.. వెన్నుపోటు పదంతో చంద్రబాబు ను నిందించే ఛాన్సు తమకు పోతుందని వారు భావిస్తున్నారు.
Recent Random Post:

















