
బహుశా ఇది మొదటి సారి ఏమీ కాదు. అసెంబ్లీ సాక్షిగానే గత ప్రభుత్వాలను అభినందించే హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గత ప్రభుత్వాలను కొన్ని విషయాల్లో విమర్శించే కేసీఆర్ మరి కొన్ని విషయాల్లో అభినందించడాన్ని మాత్రం ఆపడటం లేదు. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన పథకాల విషయంలో కేసీఆర్ పలుసార్లు అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు అభినందనీయమే అని చెప్పాలి. కాంగ్రెస్ వాళ్లు, వైఎస్ అని అంటూ.. వివిధ పథకాల ప్రస్తావన తెస్తున్నారు కేసీఆర్.
ఇది వరకూ కేసీఆర్ అసెంబ్లీలో ఒకసారి మాట్లాడుతూ.. 108,104సేవలను ప్రశంసించారు. గతంలో అవి పని చేసిన తీరును అభినందించారు. తను తెలంగాణ ఉద్యమంలో ఉండగా.. ఒక రూరల్ ఏరియాకు వెళ్లిన సమయంలో సామాన్యులకు ఎవరికో యాక్సిడెంట్ జరిగితే, వారిని తన కార్లో తీసుకెళ్తాను అని చెప్పినా వారు వినలేదని, 108కి కాల్ చేశాం.. పది నిమిషాల్లో వస్తుందని ప్రజలే తనకు రివర్స్ లో చెప్పారని. తను అక్కడే నిలబడి ఉండగా.. ఆరో నిమిషంలోనే 108వచ్చి క్షతగాత్రులను తీసుకెళ్లిందని.. కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు.
అది వైఎస్ హయాం గురించి కేసీఆర్ వివరించిన వైనం. 108సేవలను కాంగ్రెస్ ప్రభుత్వమే, వైఎస్ రాజశేఖర్ రెడ్డే మొదలుపెట్టారని, ప్రజల్లో వాటి పట్ల భరోసాను కల్పిస్తూ వాటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని.. తాము వాటినే అదే విధంగా కొనసాగిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారప్పుడు. ఇక ఉచిత విద్యుత్ అంశంపై మాట్లాడుతూ.. మరోసారి వైఎస్ ను తలిచారు కేసీఆర్. ఉచిత విద్యుత్ పథకాన్ని ఆరంభించింది వైఎస్సేనని ఆ విషయాన్ని తాము కాదనమని.. మంచి పని ఎవరు చేసినా దాన్ని అభినందిస్తామని.. తమకు ఆ నేచర్ ఉందని కేసీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
ఈ రకమైన హుందాతనాని వ్యక్తపరుస్తున్నారు కేసీఆర్. అయితే ఏపీ సీఎం నుంచి ఇలాంటి హుందాతనం ఎక్స్ పెక్ట్ చేయడానికే లేకుండా పోయింది. ఇన్నాళ్లు అయ్యింది.. చంద్రబాబు మాట్లాడితే గత ప్రభుత్వాలను తిట్టడం, అన్నీ నేనే చేశాను అని చెప్పుకోవడమే తప్ప.. కొద్ది పాటిగా అయినా రాయల్ గా మాట్లాడలేకపోయారు. మాట్లాడలేరు కూడా. చంద్రబాబు తత్వానికే అది విరుద్ధం.
ఇప్పుడు మరో ప్రహసనం ఏమిటంటే.. జగన్ పాదయాత్ర విషయంలో చంద్రబాబు అనుచితంగా మాట్లాడటం. జగన్ పాదయాత్ర చేస్తానంటుంటే.. తుని రైలు సంఘటనలు మళ్లీ జరిగే అవకాశం ఉందని బాబు శకునం చెప్పాడు. మరి తునికి బాధ్యుడు జగనే అయితే ఇంత వరకూ ఆ కేసులో చర్యలు లేవేం? అయినా చంద్రబాబు మాట తీరును చూస్తుంటే.. తెలుగుదేశం వాళ్లే అల్లర్లను క్రియేట్ చేసి వాటిని జగన్ పై తోసేయడానికి ఇదంతా స్కెచ్చేమో అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Recent Random Post:

















