సీక్రెట్ గా బ్రహ్మాజి పెళ్లి.. పెద్దలు ఎవరంటే..?

సెలబ్రిటీ చిట్ చాట్ షోలకు బుల్లితెర మీద విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మొన్నటిదాకా ఈటీవీలో అలీతో సరదాగా షో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. చాలామంది సెలబ్రిటీస్ తో అలీ ఆనాటి సినీ వార్తలను ప్రేక్షకులకు అలరించారు. ఇక ఆ షో ముగిసింది అనుకోగా మరో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తో అలా మొదలైంది షో మొదలు పెట్టారు. అయితే ఇది కేవలం సెలబ్రిటీ కపుల్స్ తో చేసే ఇంటర్వ్యూ. చిన్నగా ఈ షో కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది.

ఇప్పటికే పది ఎపిసోడ్స్ వరకు పూర్తి చేసుకున్న అలా మొదలైంది షోకి లేటెస్ట్ గెస్ట్ గా బ్రహ్మాజీ ఆయన సతీమణి శాశ్వతి అటెండ్ అయ్యారు. ఇంట్లో తెలియకుండా కోఠి ఆర్య సమాజ్ లో మా పెళ్లి జరిగిందని చెప్పారు బ్రహ్మాజీ. తమ పెళ్లిని కృష్ణవంశీ రమ్యకృష్ణలే దగ్గర ఉండి చేయించారని అప్పుడు చంద్రలేఖ సినిమా షూటింగ్ లో ఉన్నామని అన్నారు. ఒక మనిషిలో క్యారెక్టర్ పర్సనాలిటీ చూస్తాం. ఎలా మాట్లాడుతున్నారన్నది గమనిస్తాం. శాశ్వతి విషయంలో ఆమె క్యారెక్టర్ బాగా నచ్చిందని అన్నారు.

శాశ్వతి అప్పటికే డివోర్స్ తీసుకుంది. అయినా సరే తను నచ్చడంతో పెళ్లి చేసుకున్నామని అన్నారు. తన పెళ్లికి రమ్యకృష్ణ చెన్నై నుంచి జాకెట్ కుట్టించి తీసుకొచ్చారని అన్నారు శాశ్వతి. నా తరపున గంగరాజు గారు.. తన తరుపున జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ పెళ్లికి వచ్చారని అన్నారు బ్రహ్మాజీ.

పెళ్లి అవడమే ఆలస్యం మోహన్ బాబు గారి సినిమా షూటింగ్ కోసం అనంతపురం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మూడు రోజులు ఏ.వి.ఎస్ గారితో రూమ్ షేర్ చేసుకున్నా.. పెళ్లి చేసుకుని నాతో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నావ్ అని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు.

ఇద్దరిలో ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా అంటే.. నాకు సర్ ప్రైజ్ లు నచ్చవు కానీ బ్రహ్మాజీ మాత్రం అప్పుడప్పుడు సర్ ప్రైజ్ చేస్తారని శాశ్వతి చెప్పుకొచ్చారు. బిఫోర్ మ్యారేజ్ జరిగిన ఒక ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అంటే ఇద్దరం కలిసి ఆగ్రా వెళ్లామని అన్నారు బ్రహ్మాజీ. పెళ్లికి ముందు ఎస్టీడీ బూత్ లో గంటలు గంటలు మాట్లాడే వాడిని.. తన వెనక ఉన్న వారు ఎప్పుడు ఫోన్ పెట్టేస్తానా అని ఎదురుచూశానని చెప్పారు బ్రజ్మాజి. కోప్పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ వెంటనే కూల్ అయిపోతాం అంటున్నారు ఈ ఇద్దరు.

ఇక షో అయ్యాక ఇంటికి వెళ్తే తన గురించి ఇల ఎందుకు చెప్పానని నాతో గొడవ పడుతుంది అన్నారు బ్రహ్మాజీ. కానీ ఫైనల్ గా తానే సారీ చెబుతుందని అన్నారు. 12:30కి కచ్చితంగా అందరం కలిసి భోజనం చేస్తాం. ఒకవేళ తాను బయట ఉన్నా ఫోన్ చేసి తనకు ఇష్టమైనవి వండి రెడీగా పెడుతుందని అన్నారు బ్రహ్మాజీ. ప్రేమగా భర్తని బాజూ అని.. బ్రహ్మాజీ అని పిలుస్తా అని శాశ్వతి అంటే.. తనని చాచూ అని పిలుస్తానని అన్నారు బ్రహ్మాజీ. ఈ షోలో మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారని వెన్నెల కిశోర్ మీద పంచ్ వేశారు బ్రహ్మాజీ.


Recent Random Post: