సోషల్ మీడియాలో ‘సైనిక’ వందనం

బన్నీ సినిమాల్లో హిట్స్ ఉండొచ్చు, ఫ్లాపులూ ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బన్నీ ఎప్పుడూ హిట్టే. అతడికున్న ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అందుకే అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న ఎలిమెంట్ అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ‘సైనిక’ సాంగ్ కూడా అంతే.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బన్నీ నటిస్తున్న నా పేరు సూర్య సినిమా నుంచి సైనిక అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ కు కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఉదయం 8గంటలకు విడుదలైన ఈ పాట, మరికాసేపట్లో మిలియన్ వ్యూస్ నమోదు చేయబోతోంది. లైక్స్ ఇప్పటికే 70వేలు దాటాయి.

సైనికులకు అంకితమిస్తూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. బాలీవుడ్ సంగీతద్వయం విశాల్-శేఖర్ దీనికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సాంగ్ రికార్డింగ్స్, మిక్సింగ్ అంతా ముంబయిలోనే జరుగుతోంది.

నా పేరు సూర్య సినిమాలో సైనికుడిగా నటిస్తున్నాడు బన్నీ. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సినిమాకు సంబంధించి మరో పాటను వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు.


Recent Random Post: