ఫ్యామిలీ కోసమే ఆ సినిమాలు వదులుకున్నా..!

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ త్రిష. నాలుగు పదుల వయసులో కూడా త్రిష జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం చిరంజీవి సినిమా విశ్వంభర లో నటిస్తూ మరో వైపు తమిళంలో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తోంది.

సౌత్‌ లో లేడీ సూపర్ స్టార్‌ అనిపించుకుంటున్న త్రిష నార్త్‌ లో మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమాకు పరిమితం అయ్యింది. చాలా ఏళ్ల క్రితం హిందీలో త్రిష కట్టామీఠా సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో త్రిష మళ్లీ బాలీవుడ్‌ లో కనిపించలేదు.

కట్టామిఠా ఫ్లాప్ వల్ల త్రిష కి బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు రాలేదు అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే త్రిష మాత్రం బాలీవుడ్‌ లో సినిమాలు చేయక పోవడం వెనుక కారణం ను ఇటీవల చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌ నుంచి నాకు చాలానే ఆఫర్లు వచ్చాయని, కానీ నేను వాటిని తిరస్కరించాను అంది.

హిందీలో నేను సినిమాలు చేస్తే నా ఫ్యామిలీని ముంబైకి మార్చాల్సి వస్తుంది. ఒక వేళ వారు ముంబైకి రాకుంటే హిందీ సినిమాల కోసం వారిని వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను హిందీ సినిమాలకు దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నాకు సౌత్‌ లో ఇంత క్రేజ్ ఉండగా నార్త్‌ కు వెళ్లాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా ప్రశ్నించింది.

నాకు సౌత్‌ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా హిందీ సినిమాలు వద్దు అనుకున్నాను.. అంతే తప్ప ఆఫర్లు లేక కాదు అని త్రిష ఫుల్‌ క్లారిటీగా పేర్కొంది.