
మహారాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణికి అనుకోని చేదు అనుభవం ఒకటి ఎదురైంది. సీఎం వైఫ్ గానే కాదు.. తనదైన శైలిలో ఆమె చురుగ్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. తాజాగా అలా వెళ్లిన ఒక ప్రోగ్రాంలో ఆమెకు ఊహించని పరిస్థితి ఎదురైంది.
పతంజలి ఉత్పత్తుల ప్రచారానికి షోలాపూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె వెళ్లారు. అక్కడ మన డ్వాక్రా సంఘాల మాదిరి వివిధ ఉత్పత్తులు తయారు చేసే మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ సాయాన్ని కల్పించొచ్చుగా అని వారు ప్రశ్నించారు.
ఉత్సాహంగా పతంజలి కార్యక్రమానికి హాజరైన అమృత ఫడ్నవీస్ కు.. ఊహించనిరీతిలో మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. . ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
ఇదే సమయంలో స్పందించిన పోలీసులు.. నిరసన చేస్తున్న మహిళల్ని.. కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయనప్పటికీ.. ప్రశ్నించి వదిలేశారు. ఇదిలా ఉండగా.. పతంజలి ఉత్పత్తులకు చాలానే సర్టిఫికేట్లు ఇచ్చేశారు అమృత ఫడ్నవీస్. పతంజలి ఉత్పత్తుల్ని ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని.. ఈ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. పతంజలి ఉత్పత్తులకు సదరు సీఎం వైఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు?
Recent Random Post: