గోవాలో చిక్కుకున్న సీనియర్ నటి… తిండి లేక..

క్యాన్సర్ మహమ్మారి బారి నుంచి కోలుకున్న సీనియర్ నటి నఫిసా అలీ… కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గోవాలో చిక్కుకున్నారు. లాక్ డౌన్‌కి ముందు కూతురి కుటుంబంతో కలిసి సరదాగా పది రోజులు గడిపేందుకు గోవాకు వచ్చారట నఫిసా. అర్ధాంతరంగా లాక్ డౌన్ ప్రకటించడంతో గోవాలో చిక్కుకుపోయామని, ఇప్పుడు తాము తెచ్చుకున్న ఆహారం, మందులు కూడా అయిపోవడంతో పడరాని కష్టాలు పడుతున్నామని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది 63 ఏళ్ల సీనియర్ హీరోయిన్.

‘మేం పది రోజులకి తెచ్చుకున్న ఆహారం, తదితర సామాగ్రి దాదాపు అయిపోయింది. నేను క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నా. రోజూ మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో అది వీలు కావడం లేదు. ఇక్కడ కూరగాయలు, పండ్లు దొరకడం లేదు. కొన్ని రోజులుగా దొరికిందేదో తినాల్సి వస్తోంది. గోవాలోని మోర్జిం ఏరియాలో ఉన్నవారందరిదీ ఇదే పరిస్థితి’ అంటూ రాసుకొచ్చింది నఫిసా. తన మనవరాళ్ల స్కూళ్లు మూతపడడంతో కూతురి కోరిక మేరకు గోవా వచ్చామని ఇప్పుడు అన్నీ మారిపోయాయని, లాక్ డౌన్‌తో కొరియర్ సర్వీసులు కూడా మూతపడడంతో మెడిసిన్స్ కూడా వేసుకోలేకపోతున్నానంటూ విచారం వ్యక్తం చేసిందీ సీనియర్ నటీమణి.

తాను తెచ్చుకున్న మందులు అయిపోయాయని, ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపిన ఆమె… ఈ పరిస్థితుల త్వరగా బయటపడతామంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన నఫిసా మేనకోడలు దియా నాయుడు కరోనా పాజిటివ్‌గా తేలడం విశేషం. బెంగళూరులో ఆసుపత్రిలో చేరిన దియా, రెండు వారాల్లో కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యం సాధించింది.


Recent Random Post: