
తన తొలి సినిమాకు తన పేరునే టైటిల్‌గా పెట్టుకున్నాడు అక్కినేని అఖిల్. అతడి రెండో సినిమా విషయంలో కొన్ని నెలల కిందటే ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘జున్ను’ అనే ఆ టైటిల్ వెరైటీగా అనిపించి.. భలే ఆసక్తి రేకెత్తించింది. కానీ అది తమ సినిమా టైటిల్ కాదంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఐతే ఇప్పుడు ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ కొత్త టైటిల్ రిజిస్టర్ చేయించడం చూసి.. ఆ టైటిల్ అఖిల్ సినిమాకే అని చర్చించుకుంటున్నారు.
నాగార్జున ఇటీవలే ‘రంగులరాట్నం’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.‘రంగులరాట్నం’ పేరుతో ఎప్పుడో 50 ఏళ్ల కిందట తెలుగులో చంద్రమోహన్ హీరోగా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రావడం విశేషం. మళ్లీ ఈ మోడర్న్ టైమ్స్‌లో అలాంటి టైటిల్‌తో సినిమా రాబోతుండటం విశేషమే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న సినిమా ఓ కుర్రాడి జీవిత గమనానికి సంబంధించిన సినిమా.
ఇందులో హీరో 21 ఏళ్లకే చనిపోతాడని తెలిసినపుడు అతనేం చేశాడనే నేపథ్యంలో కథ నడుస్తుందని ఊహాగానాలు వినిపించాయి. దీన్ని బట్టి చూస్తే ‘రంగులరాట్నం’ అనే టైటిల్ అఖిల్ సినిమాకే అయి ఉంటుందని భావిస్తున్నారు. అఖిల్-విక్రమ్ సినిమా మొదలై దాదాపు ఐదు నెలలవుతున్నా.. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ బయటికి రాలేదు. ఐతే త్వరలోనే టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారని సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబరు నెలాఖర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే.
Recent Random Post: