పిక్ టాక్ : మెగా ఫ్యామిలీ శ్రావణ సందడి

మెగా ఫ్యామిలీ నాలుగు తరాల వారిని ఇక్కడ చూడవచ్చు. మెగా స్టార్ చిరంజీవి అమ్మగారు… భార్య మరియు చరణ్ భార్య ఇంకా చిరంజీవి మనవరాలు ఇలా ఈ నలుగురు కూడా శ్రావణ శుక్రవారం సందర్బంగా వరలక్ష్మి వ్రతం చేశారు. ఆ సందర్బంగా తీసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి సతీమణి మరియు ఉపాసనలు నిర్వహించిన ఈ వ్రతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి సందర్బంలో కూడా ఉపాసన తన అత్తవారింటితో కలిసి జరుపుకోవడం మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా అనిపిస్తుంది.

ఉపాసన వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి సమయాల్లో కుటుంబంతో గడుపుతూ ప్రతి ఒక్కరికి సమ ప్రాధాన్యంను ఇస్తూ ఉంటారు. మెగా స్టార్ చిరంజీవి కుటుంబం అంతా ఇలా చూస్తు ఉంటే కన్నుల పండుగగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి కుటంబంకు చెందిన నాలుగు తరాల వారు ఇలా ఒకే ఫ్రేమ్ లో ఆడవారు కనిపించడం చాలా అరుదైన ఫొటో అంటూ మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

చిరంజీవి ఫ్యామిలీ ఇలాంటి పండుగలు మరియు ప్రత్యేక సందర్బాల్లో తప్పకుండా కలుస్తూ ఉంటారు. మరోసారి ఈ కలయిక జరిగింది. కన్నుల పండుగగా కన్నుల వింధుగా అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్రతానికి సంబంధించిన మరిన్ని ఫొటోలు వీడియోలు వచ్చి ఉంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ వేడుక శ్రావణ శుక్రవారం సందడి హడావుడి అన్ని విధాలుగా బాగుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

TAGS: latest news Trend Latest Updates Trending news