పూజా హెగ్డే ‘న్యూడ్‌’ ముచ్చట్లు

మెన్స్‌ మ్యాగజైన్స్‌కి ఫోటోషూట్స్‌ చేసిన హీరోయిన్లని వాళ్లు చేసే ఇంటర్వ్యూలు కూడా హాట్‌గానే వుంటాయి. ఇటీవల మాగ్జిమ్‌ మ్యాగజైన్‌ కోసం కళ్లు చెదిరే సెక్సీ ఫోటోషూట్‌ చేసిన పూజా హెగ్డేని కూడా మాగ్జిమ్‌ అదే రీతిన ప్రశ్నలడిగింది. ఇబ్బందికర ప్రశ్నలకి కూడా పూజ స్పోర్టివ్‌గా సమాధానాలిచ్చింది.

వెండితెరపై పూర్తి నగ్నంగా కనిపించాల్సిన అవసరం వస్తే నటిస్తావా అని అడిగితే తాను ఎప్పటికీ నగ్నంగా నటించనని, సినీ రంగానికి రాకముందే ఈ విషయంపై ఫిక్స్‌ అయిపోయానని, సీన్‌కి ఎంత అవసరమైనా సరే నగ్నంగా నటించేది లేదని చెప్పింది. అయినా ఇండియన్‌ సినిమా కానీ, ఇండియన్‌ ఆడియన్స్‌ కానీ నగ్న దృశ్యాలకి రెడీగా లేరని ఆమె అభిప్రాయపడింది.

అయితే తనకి తాను ఎప్పుడు బాగా సెక్సీగా అనిపిస్తుందనే ప్రశ్న అడిగినప్పుడు ”నగ్నంగా వున్నప్పుడు నాకు నేను చాలా సెక్సీగా అనిపిస్తా” అంటూ కొంటె సమాధానం ఇచ్చింది. అంటే తనకి అత్యంత సెక్సీగా అనిపించేది ఎప్పటికీ తెరపై చేయనని పూజ చెబుతోంది. ఇకపోతే మగాళ్లలో సెన్సాఫ్‌ హ్యూమర్‌ వుండాలని, నవ్వించే మగాడికి ఈజీగా ఎట్రాక్ట్‌ అవుతానని చెప్పింది.

ఆడవాళ్లని చిన్న పిల్లల తరహాలో గారాబం చేసి మాట్లాడితే తనకి నచ్చదని, వాళ్లని పెద్దవాళ్లలానే ట్రీట్‌ చేయాలని, ఆ విధంగా ముద్దు చేయాలని చూసే వాళ్లు ఎదురుపడితే ‘బాబూ అలా మాట్లాడొద్దు ప్లీజ్‌’ అని మొహమ్మీదే చెప్పేస్తాననంది.