చైసామ్‌ పుకార్లపై శ్రీరెడ్డి రియాక్షన్‌

వివాదాలు ఎక్కడ ఉంటే శ్రీరెడ్డి అక్కడ ఉంటుంది అన్నట్లుగా టాక్ ఉంది. శ్రీరెడ్డి తెలుగు పరిశ్రమలో తనదైన గుర్తింపును దక్కించుకుంది. సినిమాల్లో నటించకుండానే సోషల్‌ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు.. చేసిన పని కారణంగా చాలా ఫేమస్ అయ్యింది. తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా చాలా విషయాల గురించి ఆమె సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి శ్రీరెడ్డి ఒక విషయమై మాట్లాడుతూ ఈసారి చాలా మంది ప్రశంసలు దక్కించుకుంది.

గత కొన్ని రోజులుగా నాగచైతన్య మరియు సమంతల మద్య ఏం జరుగుతుంది.. ఇద్దరు విడాకులు తీసుకున్నారా అనే చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇద్దరు కూడా కాస్త దూరం గా ఉండటంతో పాటు తన పేరుకు ముందు అక్కినేని అనే పదంను సమంత తొలగించడం జరిగింది. కనుక ఇద్దరి మద్య ఏదో జరుగుతంది అనే చర్చ మొదలు అయ్యింది. దాంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా శ్రీరెడ్డి స్పందిస్తూ టాలీవుడ్‌ లో సమంత మరియు చైతన్యలు చాలా మంచి క్యూట్‌ కపుల్‌. వారు ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నా. వారి గురించి తప్పుడు కథనాలు రాయవద్దంటూ మీడియాకు ఆమె విజ్ఞప్తి చేసింది. అక్కినేని అభిమానులు కూడా చాలా మంది శ్రీరెడ్డి తరహాలో విజ్ఞప్తి చేస్తున్నారు.