విజయ్ కి దిల్‌ రాజు ఇస్తున్నది ఎంతో తెలుసా?

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ను తెలుగు లోకి తీసుకు వచ్చేందుకు దిల్‌ రాజు చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది. ఆయనతో వంశీ పైడిపల్లి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కించబోతున్న సినిమా చకచక ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌ పై దిల్‌ రాజు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. బడ్జెట్‌ విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. దాదాపుగా ఈ సినిమా కోసం 180 నుండి 200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటించబోతున్నందుకు గాను ఏకంగా 100 కోట్ల పారితోషికంను అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ గా 10 కోట్ల రూపాయలు ముట్టాయి. సినిమా బిజినెస్‌ సమయంలో 100 కోట్ల రూపాయలను ఆయన కు ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నారు. విజయ్‌ సినిమా సక్సెస్‌ అయితే లాభాల్లో వాటాను కూడ ఆ దక్కించుకోబోతున్నాడు. సినిమా మినిమంగా సక్సెస్ అయినా కూడా తమిళనాట వసూళ్లు కుమ్మేస్తాయి. కనుక విజయ్‌ కి మరో పాతిక కోట్ల వరకు అయినా పారితోషికంగా వస్తుందని అంటున్నారు. అంటే మొత్తంగా రూ.125 కోట్ల వరకు పారితోషికంగా విజయ్‌ తెలుగు ఎంట్రీ మూవీకి దక్కించుకోబోతున్నాడన్నమాట.