కంగనా కార్ వ్యాన్ వెరీ కాస్ట్ లీ..!

సెలబ్రిటీస్ కార్ వ్యాన్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. స్టార్ హీరోలంతా కూడా షూటింగ్ కు తమ కార్ వ్యాన్ ని తెచ్చుకుంటారు. షూటింగ్ గ్యాప్ లో కార్ వ్యాన్ లో రెస్ట్ తీసుకుంటారు. షాట్ రెడీ అయ్యాకే కార్ వ్యాన్ నుంచి బయటకు వస్తారు.

ఒక్కోసారి షూటింగ్ అనుకోని కారణాల వల్ల లేట్ అయితే స్టార్స్ తమ కార్ వ్యాన్ లోనే రెస్ట్ తీసుకుంటారు. సెలబ్రిటీస్ కూడా తమ కార్ వ్యాన్ ని రకరకాల డిజైన్స్ తో రెడీ చేసుకుంటారు. బాలీవుడ్ లీడింగ్ లేడీ కంగనా రనౌత్ కూడా తన కార్ వ్యాన్ ని సంథింగ్ స్పెషల్ గా చేయించుకుందట.

సాధారణంగా హీరోయిన్స్ కి కంపెనీ కార్ వ్యాన్ ఉంటుంది. కానీ కంగనా మాత్రం తన కోసం స్పెషల్ గా ఒక కార్ వ్యాన్ రెడీ చేయించుకుంది. బాలీవుడ్ ఫేమస్ కార్ వ్యాన్ స్పెషలిస్ట్ కేతన్ రావల్ కంగనా కార్ వ్యాన్ ని డిసైన్ చేశారు. కంగనాకే కాదు చాలామంది హీరోయిన్స్ కి కూడా అతను కార్ వ్యాన్ డిజైన్ చేశారు.

కంగనా రనౌత్ కార్ వ్యాన్ ఇంటీరియర్ ని లగ్జరీగా సిద్ధం చేశారట. కార్ వ్యాన్ లో మిర్రర్స్ కూడా ఇంట్లో ఉన్నట్టుగా ఏర్పాటు చేశారట. ఈ ఇంటీరియర్ డిజైన్ కోసమే దాదాపు 65 లక్షల దాకా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. మరే ఇతర సెలబ్రిటీ కూడా కార్ వ్యాన్ కోసం ఇంత భారీగా ఖర్చు చేయలేదని చెప్పొచ్చు.

బాలీవుడ్ లో పూనం థిల్లన్ కార్ వ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీదేవి అనీల్ కపూర్ అమితాబ్ బచ్చన్ వారు కార్ వ్యాన్ లను వాడారు. బాలీవుడ్ స్టార్స్ లో షారుఖ్ ఖాన్ కార్ వ్యాన్ చాలా కాస్ట్ లీగా ఉంటుంది. హీరో హీరోయిన్స్ కూడా కార్ వ్యాన్ లో కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగులో అల్లు అర్జున్ కార్ వ్యాన్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కంగనా రనౌత్ చంద్రముఖి 2లో కూడా నటిస్తుంది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చంద్రముఖి 2 లో కంగనా నటించడం ఆ సినిమాకు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగులో కంగనా రనౌత్ ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ సినిమా చేసిన విషయం తెలిసిందే.