ఆ పాప ఐడెంటిటీ మార్చేసిన స‌లార్!

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ‘స‌లార్’ వ‌సూళ్లు సునామీ కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌తో ‘స‌లార్’ జోరు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద ‘డంకీ’ తేలిపో వ‌డంతో ‘స‌లార్’ దే పై చేయి అయింది. ప్రస్తుతానికి పోటీగా ఏ సినిమా కూడా లేక‌పోవ‌డంతో ‘స‌లార్’ దూకుడ్ని ఇప్ప‌ట్లో ఆప‌డం సాధ్యం కానిదే. భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిన సినిమాలో న‌టీన‌టులు అంతే హైలైట్ అవుతున్నారు.

ప్ర‌తీ న‌టుడి గురించి ప్రేక్ష‌కాభిమాన‌లు ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగ‌మైన ప్ర‌తీ చిన్న క్యారెక్టర్ అంతే హైలైట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో గిరిజన అమ్మాయి పాత్ర‌లో ఓ పాప క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాప ఆహార్యం…న‌ట‌న ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. సినిమాలో కథ మారడానికి ఆ అమ్మాయే కారణం. సినిమాలో సురభి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది.

దీంతో ఆ అమ్మాయి ఎవ‌రు? అని నెట్టింట సెర్చ్ చేయ‌డం పెరుగుతోంది. ఆ పాప వివ‌రాల్లోకి వెళ్తే. ఆమె పేరు సయ్యద్ ఫర్జానా. ‘సలార్’ తో ఫర్జానాకు మంచి గుర్తింపు.. పేరు ద‌క్కింది. అంతకు మందు ‘ఓరి దేవుడా’ సినిమాతో పాటు ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్ లోనూ న‌టించింది. ఐపీఎల్ ప్ర‌కట‌న‌తో పాటు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోమోలో కూడా ఫర్జానా క‌నిపించింది. అలాగే కొన్ని స్కూల్ కి సంబంధించిన‌ యాడ్స్ లో కూడా న‌టించింది.

‘సలార్’ లో కాటేరమ్మ ఫైట్ సీన్ లో ప‌ర్జానా బాగా హైలైట్ అయ్యింది. అయితే ఈ పాత్ర త‌న‌కు రావ‌డం చాలా ల‌క్కీ అని ప‌ర్జానా తెలిపింది. చాలా మంది బాల న‌టుల్ని ప‌రిశీలించి చివ‌రిగా ఆ అవ‌కాశం త‌న‌కే ఇచ్చార‌ని సంతోషం వ్య‌క్తం చేసింది. ఈ సినిమాలో న‌టించిన త‌ర్వాత స్కూల్ కి వెళ్తుంటే అంతా ప్ర‌త్యే కంగా చూస్తున్నార‌ని సంతోషం ప‌డింది. స్కూల్ టీచర్స్ .. ఫ్రెండ్స్ అభినందిస్తుంటే ఆనందంగా ఉంద‌ని తెలిపింది.