ఐకాన్ నితిన్.. అల్లు ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

దిల్ రాజు ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ సినిమా నితిన్ తో ఫిక్స్ చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ సినిమా వస్తుంది. అయితే ఈ కాంబో సినిమా అనగానే నితిన్ తో వేణు శ్రీరామ్ చేసేది ఐకాన్ సినిమానే అంటూ సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేయాలని అనౌన్స్ మెంట్ కూడా చేశాడు దిల్ రాజు. వేణు శ్రీరాం డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ పుష్ప పార్ట్ 1 తో నేషనల్ వైడ్ భారీ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ తో సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు.

అయితే ఐకాన్ కోసం అనుకున్న కథ నచ్చినా ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది కాబట్టి దాన్ని హోల్డ్ లో పెట్టారు. అల్లు అర్జున్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన వేణు శ్రీరామ్ నితిన్ తో సినిమా ఫైనల్ చేసుకున్నాడు. నితిన్ తో వేణు శ్రీరామ్ వేరే కథ చెప్పి ఒప్పించాడా లేక ఐకాన్ కథతోనే వీరి కాంబో సినిమా వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఐకాన్ కథ అయినా కూడా ఆ టైటిల్ ని వాడే సాహసం మాత్రం చేసే అవకాశం లేదు. అలా ఎందుకు అంటే పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ స్క్రీన్ నేమ్ గా ఐకాన్ స్టార్ కూడా మారుమోగింది.

అలాంటి ఐకాన్ టైటిల్ ని నితిన్ సినిమాకు వాడుతానంటే మాత్రం అల్లు ఫ్యాన్స్ ఒప్పుకునే ఛాన్స్ లేదు. అంతెందుకు నితిన్ అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంది కాబట్టి నితిన్ కూడా ఐకాన్ టైటిల్ ని పెడతానన్నా ఒప్పుకునే ఛాన్స్ లేదు. సో వేణు శ్రీరామ్ తో నితిన్ చేస్తున్న సినిమా కథ ఏదైనా సరే ఐకాన్ టైటిల్ పెట్టే ఛాన్స్ ఉండదు.

దిల్ రాజు కూడా ఐకాన్ సినిమాను ఎప్పటికైనా అల్లు అర్జున్ తోనే చేయాలని ప్లానింగ్ తో ఉన్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతానికి సందీప్ వంగా సినిమానే ఓకే చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉందని తెలుస్తుంది.

పుష్ప ముందు వరకు ఐకాన్ ని కేవలం తెలుగు వరకే చేయాలని అనుకున్న దిల్ రాజు పుష్ప తో బన్నీకి వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ చూసి ఐకాన్ తీస్తే నేషనల్ లెవెల్ లో అదరగొట్టేలా ప్లాన్ చేస్తున్నారట. సో ఎట్టిపరిస్థితుల్లో నితిన్ ఐకాన్ అయ్యే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. అల్లు అర్జున్ ఐకాన్ కనబడుట లేదు సినిమా కోసం అల్లు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.