‘ఆదిపురుష్’ అగ్నిప్రమాదం ఓ కుట్ర..!! బాలీవుడ్ లో జోరుగా కథనాలు

దేశంలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఒకటి. ప్రభాస్ రాముడిగా, సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ వ్యయంతో తెరకెక్కుతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెట్లో షూటింగ్ తొలిరోజునే భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెట్ నిర్మాణంలో ఈ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందనే భావించారు. అయితే.. ఇందులో కుట్ర కోణం ఉందని ఇప్పుడు బాలీవుడ్ లో జోరుగా వార్తలు రౌండ్ అవుతున్నాయి.

ఆమధ్య రావణ పాత్రధారి సైఫ్ ఆలీఖాన్ సినిమాలో రావణాసురుడి పాత్రపై చేసిన కామెంట్స్ ఏస్థాయిలో వివాదం రేపాయో తెలిసిందే. సైఫ్ ఇందుకు బహిరంగంగానే క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. అయితే.. వివాదం అంతటితో సద్దుమణిగిందనే అందరూ భావించారు. కానీ.. కొన్ని శక్తులు సైఫ్ వ్యాఖ్యలపై శాంతించలేదని వార్తలు వస్తున్నాయి. వారే.. వ్యూహాత్మకంగా ఆదిపురుష్ సెట్లో అగ్నిప్రమాదం జరిగేలా చేశారని వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే.. సినిమా టీమ్ ఈ విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.