#RRR : ఆలియా రాకతో ఆ సాంగ్ మరియు యాక్షన్‌ సీన్‌ పూర్తి

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందని ఏడాది కాలంగా ప్రచారం అయితే జరుగుతుంది. కాని ఇప్పటి వరకు ఆ సినిమా పూర్తి మాత్రం కాలేదు. కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంది. ముఖ్యంగా ఆలియా భట్ మరియు చరణ్‌లపై ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. అలాగే ఆలియా ఒక యాక్షన్‌ సన్నివేశంలో కూడా నటించాల్సి ఉంది. ఈ రెండు పూర్తి అయితే ఆలియా పార్ట్‌ పూర్తి అయినట్లే అంటున్నారు.

ఆలియా ఈనెల చివరి వారంలో ఆర్ఆర్ఆర్‌ యూనిట్ తో జాయిన్ అవ్వబోతున్నారు. ఇప్పటికే కొన్ని ముఖ్య సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నారు. వచ్చే నెల ఆఖరు వరకు ఆర్ఆర్ఆర్‌ కు గుమ్మడి కాయ కొట్టే ఉద్దేశ్యంతో మేకర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై సస్పెన్స్‌ నెలకొంది. అక్టోబర్‌ 13న సినిమాను విడుదల చేస్తామని అన్నారు కాని షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు.