ఆర్‌ఆర్ఆర్‌: అలియా భట్ రోల్ ను పెంచారా?

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా క్లైమాక్స్ పోర్షన్స్ ను షూట్ చేసారు. వచ్చే నెలలో రామ్ చరణ్, అలియా భట్ ల మీద సాంగ్ ను షూట్ చేయాల్సి ఉంది. మొత్తానికి మే కల్లా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు.

అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా, అలియా భట్ తనకు పెయిర్ గా సీత పాత్రను పోషిస్తోంది. ఇటీవలే సీత ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి, అలియా భట్ పాత్రను ఎక్స్టెండ్ చేసాడని తెలుస్తోంది. నార్త్ లో ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడనిపిస్తుంది.