అల్లు అర్జున్ పుష్పకి ఎన్టీఆర్ కి ఉన్న లింక్ ఏంటి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్ర చెందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథగా ఇప్పటికే పుష్ప గురించి విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో లారీ డ్రైవర్ గా కనిపిస్తాడు. నెగటివ్ ఛాయలున్న పాత్ర ఇదని మూవీ యూనిట్ చెబుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

మారేడుమిల్లి అడవుల పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలై ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుంది. పుష్ప సినిమా కథ ఏంటనే కుతూహలం సినీ ప్రియుల్లో కలగడం అత్యంత సహజం. ఈ నేపథ్యంలో పుష్ప కథ ఇదేనంటూ పలు కథలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ప్రాథమికంగా తెలుస్తున్న విషయం ఏమిటంటే పుష్ప సినిమా కథ ఎన్టీఆర్ జీవితాన్ని పోలి ఉంటుందిట. నందమూరి హరికృష్ణకు రెండో భార్య సంతానం ఎన్టీఆర్. చిన్నతనంలో నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ను చేరదీయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా కష్టాలు పడి తనను తాను నిరూపించుకోవాలన్న తపనతో ఎన్టీఆర్ క్రమక్రమంగా ఎదిగి ఈరోజు టాప్ స్థాయికి చేరుకున్నాడు.

అలాగే పుష్పలో కూడా అల్లు అర్జున్ రెండో భార్య సంతానంగా కనిపిస్తాడట. చిన్నప్పటి నుండి ఎవరూ చేరదీయకపోవడంతో అడవుల్లో పెరుగుతాడని, ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకుని ఎలా ఎదిగాడు అన్నది సినిమా కథ అని తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజమెంతో అన్న విషయం అధికారికంగా తెలియజేస్తే కానీ తెలీదు.