అల్లు అర్జున్‌ మరో అరుదైన రికార్డ్‌

సౌత్‌ హీరోలు ఇన్‌ స్టాగ్రామ్ లో దూసుకు పోతున్నారు. ఇటీవలే విజయ్‌ దేవరకొండ ఇన్‌ స్టాలో 10 మిలియన్ ల ఫాలోవర్స్‌ ను చేరుకున్నాడు. సౌత్‌ నుండి మొదటి 10 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ను దక్కించుకున్న హీరోగా విజయ్‌ దేవరకొండ రికార్డు సాధించాడు. ఇప్పుడు ఆ జాబితాలో అల్లు అర్జున్‌ కూడా చేరిపోయాడు. టాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో రికార్డుల పరంపర కొనసాగిస్తూ వస్తున్నాడు.

అల్లు అర్జున్‌ హీరోగా చేస్తున్న సినిమాలు మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో కూడా బన్నీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఫేస్ బుక్ ట్విట్టర్ లో రికార్డు స్థాయిలో ఫాలో వర్స్‌ ను దక్కించుకున్న ఈయన తాజాగా ఇన్‌ స్టాలో దుమ్ము రేపుతున్నాడు. గత ఏడాది యూట్యూబ్‌ లో తన సినిమా పాటలతో సత్తా చాటాడు. ఈ ఏడాది ఆరంభంలోనే బన్నీ రికార్డుల మోత ప్రారంభం అయ్యింది.