శ్రీనివాస్ గవిరెడ్డి సినిమాలో నటిస్తోన్న బిగ్ బాస్ ఫేమ్ అరియానా

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్లకు బాగానే క్రేజ్ వచ్చిన విషయం తెల్సిందే. వరసగా అందరూ వివిధ రకాల ఆఫర్లను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 ఫైనలిస్ట్ లలో ఒకరైన అరియనా గ్లోరీ కూడా తనకు వచ్చిన అవకాశం గురించి రివీల్ చేసింది.

గత కొంత కాలం నుండి అరియనాకు సినీ ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలను అరియనా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ గవిరెడ్డి తన నెక్స్ట్ సినిమాలో అరియనాకు అవకాశం ఇచ్చాడు.

అరియనా ఈ షూటింగ్ కు సంబంధించిన పిక్స్ ను రివీల్ చేసింది. నన్ను ఇంత అందంగా చూపించినందుకు శ్రీనివాస్ గారికి థాంక్స్ అనే చెప్పింది అరియనా. నిజంగానే ఈ పిక్స్ లో మెరిసిపోతోంది అరియనా.