‘అఖండ’ లో అఘోర కు బాలయ్య ఓకే చెప్పాడా?

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి ల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ అఖండ సినిమా పై అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాలో బాలయ్య లుక్ మరియు పాత్ర విషయమై గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలయ్య ను అఘోర పాత్రలో బోయపాటి చూపించబోతున్నట్లుగా గత కొంత కాలంగా వస్తున్న వార్తలకు ఆమద్య బ్రేక్ పడింది.

బాలయ్యను అఘోర పాత్రలో చూసేందుకు అభిమానులు సిద్దంగా లేరు. దాంతో బోయపాటి మనసు మార్చుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలయ్య ను అఘోర పాత్రకు ఒప్పించేందుకు బోయపాటి చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది. బాలయ్యను అఘోర గా బోయపాటి చూపించబోతున్నాడని అంటున్నారు. అఘోర అంటే డ్రస్ లేకుండా నటించాల్సి ఉంటుంది. కాని బాలయ్య మాత్రం అలా కాకుండా కాస్త విభిన్నమైన అఘోరాగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. త్వరలోనే అఘోరా పాత్ర పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.