భీమ్లా నాయక్ హైలైట్ ఎపిసోడ్ ఇదే అంటున్నారే!

పవర్ స్టార్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. మరో ప్రధాన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇప్పటికే మొదటి సాంగ్ భీమ్లా నాయక్ కు సూపర్బ్ రెస్పాన్స్ రాగా త్వరలోనే రెండో సాంగ్ అంత ఇష్టంను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై షూట్ చేసాడు. ఈ చిత్రంలో ఇద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది.

తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కలిసి ఒరిజినల్ వెర్షన్ కు హంగులు అద్దారు. దీని ప్రకారంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను మరింత ఎఫెక్టివ్ గా మార్చారట. సినిమాకు ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఒకటని తెలుస్తోంది.