భీమ్లా నాయక్ ట్రైలర్: పవన్, రానాల అల్టిమేట్ మాస్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. ఈరోజు ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెల్సిందే. అయితే ముందు అనుకున్నట్లుగానే ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసారు.

భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్, డేనియల్ శేఖర్ గా రానా దగ్గుబాటి నటించారు. వీరిద్దరూ ఎదురుపడ్డ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయనిపిస్తోంది. ఇద్దరి ఈగోల కారణంగా పరిస్థితులు అదుపుతప్పి ఎంతవరకూ వెళ్లాయి అన్నది ప్రధాన కథాంశంగా భీమ్లా నాయక్ రూపొందింది.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సంభాషణలు కూడా బాగున్నాయి. మొత్తంగా భీమ్లా నాయక్ ట్రైలర్ అంచనాలకు తగ్గ స్థాయిలో నిలిచింది.