భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా రూపొందుతోంది భీమ్లా నాయక్.

ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు నాలుగో పాట అప్డేట్ వచ్చేసింది. భీమ్లా నాయక్ నుండి నాలుగో సింగిల్ అడవితల్లి మాట డిసెంబర్ 1న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

భీమ్లా నాయక్ చిత్ర థీమ్ ను ఈ పాట రూపంలో చెబుతారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.