బిబి అభిజిత్‌ మదర్‌ కు కరోనా పాజిటివ్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 విజేత అభిజిత్ ఎంతగా ఫేమస్ అయ్యాడో ఆయన తల్లి లక్ష్మి ప్రసన్న కూడా అంతగా ఫేమస్ అయ్యారు. ఆమె బిగ్‌ బాస్ షో లోకి వెళ్లిన సమయంలో కొట్టుకోండి.. తన్నుకోండి.. ఎంజాయ్ చేయండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆమెకు సోషల్‌ మీడియాలో ఎంతో పాపులారిటీ దక్కించుకుంది. నెట్టింట అభిజిత్ తల్లికి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. అభిజిత్ మదర్‌ కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందట. ఆ విషయాన్ని అభిజిత్ స్వయంగా సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.

అభిజిత్ మాట్లాడుతూ.. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. అమ్మకు పాజిటివ్‌ అని తేలింది. కుటుంబ సభ్యులం పరీక్ష చేయించుకోగా అందరికి నెగటివ్ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటీ అంటే అమ్మకు సీటీ లెవల్స్ బాగానే ఉన్నాయి. అమ్మ త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాం. ఈ కోవిడ్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఐసోలేషన్‌ లో ఉండటం చెత్త విషయం. వ్యాధి సోకిన మనిషి రూమ్‌ లో బంధించడం దారుణం. ఈ విషయాల గురించి ఇంకా మాట్లాడాలనుకోవడం లేదు అన్నాడు.