బిగ్ బాస్ 5: టాప్ 5 దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేగా!!

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే ఉన్నాయి. హౌజ్ లో ఉన్న ఎనిమిది మందిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే ఆ పేరు కూడా బయటకు వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ ఎపిసోడ్ కు ఎక్స్టెన్షన్ గా సాగింది. హౌజ్ మేట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్ లో సందడి చేసారు. అయితే వారు రావడానికి ఒక చిన్న కండిషన్ కూడా పెట్టారు.

అదేంటంటే హౌజ్ లో కంటెస్టెంట్స్ వాళ్లకు కావాల్సిన వాళ్ళని కలవడానికి ఏదో ఒక విలువైన వస్తువు త్యాగం చేయాలి. ఈ టాస్క్ ను రవితో మొదలుపెట్టారు. రవిను చూడటానికి వాళ్ళ అమ్మ గారు వచ్చారు. ఈ సందర్భంగా రవి కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అలాగే వచ్చిన వాళ్ళ చేత టాప్ 5 ఎవరు అన్న టాస్క్ ను కూడా ఆడించారు. రవి వాళ్ళ అమ్మ గారి ప్రకారం సన్నీ, శ్రీరామ్, రవి, మానస్, షణ్ముఖ్ లు టాప్ 5 లో ఉంటారని అన్నారు. ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ ను కూడా ఎంపిక చేయలేదు.

తర్వాత ప్రియాంక తరుపున జబర్దస్త్ ఆర్టిస్ట్ లు అప్పారావు, ప్రియాంక సిస్టర్ వచ్చారు. వాళ్లిద్దరూ పెట్టిన టాప్ 5 – ప్రియాంక, సన్నీ, శ్రీరామ్, రవి, మానస్. ఆ తర్వాత సన్నీ కోసం నిఖిల్, ఇంకా బ్రదర్ వెంకట్ వచ్చారు. వాళ్ళు పెట్టిన టాప్ 5 – సన్నీ, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, కాజల్. ఈ సందర్భంగా సన్నీ సేవ్ అయినట్లు కూడా చూపించారు.

సిరి కోసం తనకు కాబోయే భర్త శ్రీహాన్ వచ్చాడు. శ్రీహాన్ తన గురించి ఏమైనా అనుకుంటాడేమో అని సిరి క్షమాపణలు చెప్పింది కానీ శ్రీహాన్ చాలా బాగా మాట్లాడాడు. నువ్వు ఏంటో నాకు తెలుసు అని అన్నాడు. అలాగే తన టాప్ 5 – సిరి, సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్. సిరి కూడా సేవ్ అయిందని అనౌన్స్ చేసారు. మానస్ కోసం వాళ్ళ నాన్న గారు, నటుడు అమర్ డీప్ వచ్చారు. వాళ్ళ టాప్ 5 మానస్, సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్. కాజల్ కోసం వాళ్ళ సిస్టర్, సింగర్ లిప్సిక వచ్చారు. వాళ్ళ టాప్ 5 కాజల్, సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్.

శ్రీరామ్ చంద్ర కోసం తన తల్లిగారు, ఫ్రెండ్ సౌమ్య వచ్చారు. వాళ్ళ టాప్ 5 – శ్రీరామ్, షణ్ముఖ్, ప్రియాంక, సన్నీ, రవి ఉన్నారు. ఇక ఆఖరుగా షణ్ముఖ్ కోసం తన అన్నయ్య సంపత్ వచ్చాడు. అలాగే కొంచెం సేపు సస్పెన్స్ తర్వాత దీపూ కూడా వచ్చింది. వాళ్ళిద్దరి సంభాషణ కూడా ఎమోషనల్ గా సాగింది. వాళ్ళ టాప్ 5 – షణ్ముఖ్, రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్.

దాదాపుగా అందరి టాప్ 5 లో సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ కామన్ గా ఉన్నారు. మరి ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో చూడాలి.