బిగ్ బాస్: సన్నీ నిజంగానే సిరిపై అసభ్యకరంగా చేతులు వేశాడా?

బిగ్ బాస్ అంటేనే డ్రామాకు కొదవ లేదు. బిగ్ బాస్ 5 కూడా దానికి తగ్గట్లుగానే సాగుతోంది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ కింద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా విడగొట్టాడు. ఈగెల్స్, వోల్వ్స్ టీమ్స్ రెండిటికీ పిల్లోస్ ఉంటాయి. ఒక టీమ్ తమ పిల్లోలను కాపాడుకుంటూనే అవతలి టీమ్ పిల్లోస్ ను నాశనం చేయాల్సి ఉంటుంది. చివరిగా ఎవరి టీమ్ పిల్లోస్ ఎక్కువ ఉంటాయో వారు విజయం సాధించినట్లు.

అయితే ఈ టాస్క్ కొంత ఫిజికల్ అయింది. ముఖ్యంగా సిరి ఒక పిల్లోను తన డ్రెస్ లోపల పెట్టుకోగా, సన్నీ దాన్ని తీసే క్రమంలో శ్వేతాను సహాయం కోరాడు. సిరికు సహాయం చేయడానికి షణ్ముఖ్ వచ్చాడు. సిరి షర్ట్ లో నుండి శ్వేతా కొంత పిల్లో బయటకు లాగగా షణ్ముఖ్ దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు.

కానీ సిరి.. సన్నీ తన షర్ట్ లోపల చేతులు పెట్టాడని, కావాలని తనను ముట్టుకున్నాడని ఆరోపణలు చేసింది. కానీ స్లో మోషన్ లో చూస్తే సన్నీ కేవలం సిరి చేతులు మాత్రమే పట్టుకున్నాడు. ఈరోజు కూడా ఈ టాస్క్ జరగనుంది.