దేవి జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా? లేదా?

ఈ మద్య కాలంలో సినీ స్టార్స్‌ సెలబ్రెటీలు ముప్పయి అయిదు ఏళ్లు దాటితే కాని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. కొందరు అయితే నాలుగు పదులు కూడా దాటినా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆరు పదుల వయసుకు చేరువ అయినా కూడా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆయన చేసుకుంటాడో లేదో కూడా తెలియదు. ఇక రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ పెళ్లి విషయం కూడా చాలా కాలంగా మీడియాలో నానుతూనే ఉంది.

నాలుగు పదుల వయసులోకి ఎంటర్‌ అయిన దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికి కూడా పెళ్లి గురించి మీడియా ప్రశ్నిస్తే చిర్రుబుర్రులాడుతూనే ఉన్నాడు. తాజాగా దేవిశ్రీ ప్రసాద్‌ సోషల్‌ మీడియా లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్బంగా పలువురు పలు ప్రశ్నలు అడిగారు. కొందరు పెళ్లి గురించి కూడా ప్రశ్నించడంతో దయచేసి ఆ ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగి విసిగించవద్దంటూ తేల్చి పారేశాడు.

పెళ్లి గురించిన ప్రశ్న అడగొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ కు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో తన తల్లి పెళ్లి విషయమై ఒత్తిడి చేస్తుందని పేర్కొన్న దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పుడు మాత్రం తన పెళ్లి ప్రస్థావన తీసుకు రావద్దంటూ వ్యాఖ్యలు చేయడం ఒకింత అనుమానాలకు తెర తీస్తున్నాయి.

ఈయన గతంలో ఛార్మితో సహా పలువురు హీరోయిన్స్‌ తో అఫైర్స్‌ పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవన్ని కూడా పుకార్లే అంటూ దేవి గతంలో కొట్టి పారేశాడు. మరి పెళ్లి విషయంలో ఎందుకు ఆసక్తి లేడు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.