ఈసారి మీరు అన్నట్లుగా చేస్తాంః గెటప్ శ్రీను

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్ అనగానే రామ్‌ ప్రసాద్‌ మరియు గెటప్ శ్రీనులు కూడా గుర్తుకు వస్తారు. కనుక ఈ ముగ్గురిని ఒకరిని తీసి మరొకరిని పెట్టలేం అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు. గెటప్ శ్రీను మరియు సుడిగాలి సుధీర్‌ లు చాలా క్లోజ్‌ గా ఉంటారు. అందరు టీమ్ లు విడిపోయినా కూడా వీరి టీమ్ మాత్రం విడిపోలేదు. సుధీర్ ఈగో లేకుండా ఉంటాడు. దానికి తోడు చాలా సింపుల్‌ గా ఉంటాడు. అందుకే అందరు ఆయనతో చేస్తారు. అయితే ఇటీవల వీరి స్కిట్‌ లను జనాలు విమర్శిస్తున్నారు.

సుడిగాలి సుధీర్‌ స్కిట్‌ లు ఈమద్య కాలంలో చాలా నాసిరకంగా ఉంటున్నాయి, సరైన ముగింపు లేక పోవడం వల్లే ప్రతి స్కిట్‌ లో కూడా కొట్టుకుంటూ ముగిస్తున్నారు అంటూ ఒక నెటిజన్‌ స్వయంగా గెటప్‌ శ్రీనును అనడం జరిగింది. అతడి విమర్శకు గెటప్ శ్రీను చాలా హుందాగా స్పందించాడు. మీరు కోరుకున్నట్లుగా మీకు నచ్చినట్లుగా తర్వాత నుండి స్కిట్‌ లు చేస్తామంటూ ఈ సందర్బంగా గెటప్ శ్రీను హామీ ఇచ్చాడు. అంతటి విమర్శను కూడా సున్నితంగా పాజిటివ్ గా స్పీకరించిన గెటప్ శ్రీనును అభినందించాల్సిందే.