బాలయ్యతో హిట్టు కొడితే మహేష్ తో ఛాన్స్

క్రాక్ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేనికు సుడి తిరిగిందని చెప్పాలి. ఈ సినిమా సాధించిన వసూళ్లకు గోపీచంద్ మలినేనికు ఒకదాని తర్వాత ఒకటి భారీ అవకాశాలు వస్తున్నాయి. క్రాక్ చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పిలిచి అభినందించారు. భవిష్యత్తులో కుదిరితే తప్పకుండా సినిమా చేద్దామని అన్నారు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేనిను అభినందించారు.

క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ కు మైత్రి మూవీస్ సంస్థతో డీల్ కుదిరింది. బాలయ్యతో గోపీచంద్ కు సినిమా సెట్ చేద్దామని ఆ సంస్థ భావిస్తోంది. అన్ని వైపుల నుండి అంగీకారం ఉన్నా కానీ ఇంకా స్క్రిప్ట్ ఓ కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే మైత్రి మూవీస్ సంస్థ గోపీచంద్ కు ఒక భారీ అవకాశం ఇచ్చిందిట. బాలయ్యతో సినిమా తీసి హిట్ కొడితే మహేష్ ను డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్ వస్తుందని తెలిపిందిట. సో గోపీచంద్ ఇప్పుడు మరింత ఫోకస్డ్ గా బాలయ్య సినిమాకు వర్క్ చేస్తున్నాడు.