బతుకుతామనే ఆశ కోల్పోయామంటూ ఎమోషనల్ ఆయిన హాట్ బ్యూటీ

తెలుగులో పలు సినిమాల్లో నటించి తన అందాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హంసా నందిని. గత కొన్నాళ్లుగా ఈమెకు సినిమాల్లో ఆఫర్లు చాలా తగ్గాయి. అయినా కూడా ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన అభిమానులకు చేరువగానే ఉంటూ వస్తోంది. ప్రతి రోజు ఏదో ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌ షేర్‌ చేస్తూ ఉండేది. కాని మే నెలలో ఆమె నుండి ఒక్క పోస్ట్‌ కూడా రాలేదు. దాంతో ఏం అయ్యింది అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేయడం మెసేజ్‌ లు చేయడం చేశారు.

హంసా నందినికి కరోనా అంటూ కొందరు అనుకున్నారు. వారు భావించినట్లుగానే తాను కరోనా బారిన పడ్డట్లుగా తాజాగా హంసా నందిని ప్రకటించింది. తన కుటుంబం మొత్తం కూడా ఏప్రిల్‌ చివర్లో కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించింది. కరోనా వల్ల అందరం ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాం. ఆ సమయంలో మేము మళ్లీ ఇంటికి వెళ్తామనే నమ్మకం కోల్పోయాం. అందరం కూడా బతుకుతామనే ఆశను కోల్పోయాం. దాదాపుగా నెల రోజుల పాటు మేము అంతా కూడా కరోనాతో పోరాటం చేశాం. దేవుడి దయ సన్నహితులు మిత్రుల ప్రార్థనల వల్ల మేము కోలుకున్నాం. ఇప్పుడు అందరం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నామని ఆమె పేర్కొంది.