హరిహర వీరమల్లు వీఎఫ్‌ఎక్స్‌ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఆమద్య టీజర్ కూడా విడుదల అయ్యింది. సినిమా లో పవన్ కళ్యాణ్ గజ దొంగగా కనిపించబోతున్నాడు. పీరియాడిక్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌ ను కొత్తగా చూపించడంతో పాటు పవన్ అభిమానులకు కొత్త తరహా సినిమాను అందించేందుకు క్రిష్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

వీఎఫ్‌ఎక్స్ కోసం దర్శకుడు క్రిష్‌ ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్ కళ్యాన్‌ తో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు హాలీవుడ్‌ సాంకేతికతను వినియోగించి మరీ ఈ సినిమాలో యాక్షన్‌ సన్నవేశాలను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారట. దాదాపుగా 50 కోట్ల ను ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. మొత్తం బడ్జెట్‌ 150 కోట్లలో 50 కోట్లు పవన్ పారితోషికం కాగా 50 కోట్లు గ్రాఫిక్స్‌ కు మిగిలిన 50 కోట్లతో సినిమా మేకింగ్‌ ఉండబోతుందట.