వివాదం ముదరడంతో వివరణ ఇచ్చుకున్న హైపర్ ఆది

నిన్న ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈటివిలో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా కొలిచే గౌరమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సభ్యులు ఎల్బీ నగర్ పీఎస్ లో కేసు ఫైల్ చేసిన విషయం తెల్సిందే.

హైపర్ ఆది, స్క్రిప్ట్ రైటర్, ప్రొడక్షన్ సభ్యులపై కేసు నమోదైంది. ఇదిలా ఉంటే తనపై నెగటివిటీ రావడంతో హైపర్ ఆది స్పందించాడు. తాము ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని వ్యాఖ్యానించాడు హైపర్ ఆది.

అలాగే ఆ స్కిట్ కు తాను రైటర్ ను కాదని, తాను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నాడు. హైపర్ ఆది ఈటివిలో ప్రసారామయ్య జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంటాడన్న విషయం తెల్సిందే.