ఎన్టీఆర్‌30 సీనియర్ హీరోయిన్‌

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్న కొరటాల శివ వెంటనే ఎన్టీఆర్‌ 30 సినిమా వర్క్ ను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపిక అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో మరో ఇంట్రెస్టింగ్‌ వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్‌ 30 సినిమాలో సీనియర్‌ హీరోయిన్ రమ్యకృష్ణ ను నటింపజేస్తున్నారట.

బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ కు పెరిగింది. ఆమె తో ఎంతో మంది సీనియర్ దర్శకులు వర్క్‌ చేయాలనుకుంటున్నారు. ఆమె సినిమాలో ఉంటే అదనపు ఆకర్షణగా అంతా భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే ఈమె ను విజయ్‌ దేవరకొండ సినిమాలో పూరి నటింపజేస్తున్నాడు. లైగర్‌ తో పాటు పలు సినిమాల్లో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఎన్టీఆర్‌ 30 సినిమా లో కూడా రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ సినిమాల్లో రమ్యకృష్ణ నటించిన విషయం తెల్సిందే.