మహేష్‌ అనౌన్స్‌ చేసిన ‘మేజర్‌’ డేట్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ‘మేజర్‌‘ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఆర్మీ మేజర్ రియల్‌ లైఫ్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మేజర్‌ పాత్రను అడవి శేష్‌ పోషించాడు. మహేష్‌ బాబు పూర్తి స్థాయి నిర్మాతగా మారి నిర్మించిన సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వడంతో విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు ఓటీటీ అనుకున్నా కూడా సినిమాను థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. సోని పిక్చర్స్‌ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్‌ సినిమా జులై 2, 2021 వ తారీకున విడుదల కాబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తో అడవి శేష్‌ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు.