నా బ్రెయిన్‌ లో 9 టైటానియం వైర్స్ ఉన్నాయి

పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్‌ ఖాన్ ఒకానొక సమయంలో ఐటెం సాంగ్‌ లకు అడ్రస్‌ గా నిలిచింది. అద్బుతమైన టైమింగ్ మరియు డాన్స్ లతో ఐటెం సాంగ్ లను అదరగొట్టడంతో పాటు హీరోయిన్‌ గా కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది ఐటెం సాంగ్‌ లు చేశారు కాని ముమైత్‌ ఖాన్‌ చేసినట్లుగా ఐటెం సాంగ్ లు ఎవరు చేయరు అనేది చాలా మంది అంటూ ఉంటారు. ఈ మద్య కాలంలో ఇండస్ట్రీలో ఈమె జోరు తగ్గింది. కాని బుల్లి తెరపై రెగ్యులర్‌ గా కనిపిస్తూనే ఉంది.

తాజాగా ఈమె అలీ టాక్ షో లో పాల్గొంది. ఈ సందర్బంగా తన జీవితంలోని ఒక బ్యాడ్‌ మూమెంట్‌ ను షేర్‌ చేసుకుంది. ఒక రోజు బాత్‌ రూం నుండి టవల్ కట్టుకుని వచ్చి అందం ముందు సరదాగా డాన్స్ చేస్తుండగా జారి కింద పడ్డాను. ఆ సమయంలో నేను నిన్న కింద పడి నేడు లేచాను అనుకున్నాను. కాని అమ్మ చెప్పిన దాని ప్రకారం 15 రోజులు తాను బెడ్‌ పై ఉన్నాను. కింద పడ్డ సమయంలో నా బ్రెయిన్‌ లోని అయిదు నరాలు కట్‌ అయ్యాయి. దాంతో నాకు బ్రెయిన్ లో 9 టైటానియం వైర్స్‌ ను ఇన్సెర్ట్‌ చేశారు. ఆ సమయంలో నేను బతకడం 20 శాతం మాత్రమే ఛాన్స్ అన్నారట. నేను చచ్చి పుట్టాను అంటూ ముమైత్‌ ఎమోషనల్‌ అయ్యింది.